Sunday, April 28, 2024
- Advertisement -

చిట్టి ఏంజెల్ తొలి బ‌ర్త్ డే

- Advertisement -
  • అల్లు ప్రిన్సెన్స్ మొద‌టి పుట్టిన‌రోజు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో బ‌న్నీ తొలి పోస్టు

అల్లు కుటుంబం గారాల ప‌ట్టి అర్హా. అల్లుఅర్జున్‌, స్నేహారెడ్డిల ముద్దుల కూతురు అర్హా తొలి పుట్టిన‌రోజు ఈరోజు. అందుకే అర్జున్ త‌న కూతురు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న ఖాతాను ప్రారంభించారు. తొలి పోస్ట్ కూడా త‌న కూతురు గురించి పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాక బన్ని పోస్ట్‌ చేసిన మొదటి ఫొటో అర్హాదే. ‘నా చిట్టి ఏంజెల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. అప్పుడే నీకు ఏడాది నిండిందంటే నమ్మలేకపోతున్నాను.’ అని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ బర్త్‌డే, అల్లు ప్రిన్సెస్‌, ఫస్ట్‌ పోస్ట్ అనే హ్యాష్‌ట్యాగ్‌ల‌ను బ‌న్నీ జత చేశారు.

ఈ విధంగా స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ త‌న కూతురుపై ప్రేమ‌ను పంచుకున్నారు. అభిమానులకు ఇలా సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా బన్ని ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరుస్తానని రెండు రోజుల కింద‌టే ప్ర‌క‌టించారు. పాప ఫొటో పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.ప్రస్తుతం అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీకి జోడీగా మ‌జ్ను హీరోయిన్ అనుఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -