Friday, April 19, 2024
- Advertisement -

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

- Advertisement -

తెలుగులో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తదితర పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “ముద్దుల మావయ్య” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి నటుడిగా బ్రహ్మాజీ పరిచయం అయ్యాడు.

సీనియర్ నుంచి జూనియర్ హీరోల వరకు అందరి సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా తాను సినిమా అవకాశాల కోసం చెన్నైలో నివాసం ఉంటున్న సమయంలో తన భార్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. అయితే అంతకు ముందే తన భార్యకు పెళ్లై ఒక బాబు ఉన్నాడని.. కానీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుందని.. తర్వాత తాను పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం ఇద్దరం సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నామని కూడా తెలిపాడు. అయితే తాను మాత్రం తన భార్య కొడుకుపై ఉన్నటువంటి ప్రేమ తరిగి పోకూడదని ఒక్క కారణంతో తనకంటూ సపరేట్‌గా పిల్లలు కావాలని ఎప్పుడూ అనిపించలేదని తనకు కొడుకు సంజయ్ కుమార్‌ అంటే అమితమైన ప్రేమని తెలిపారు. తన కొడుకు సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఉన్నాడని చెప్పాడు.

బాలకృష్ణ సినిమా ని బోయపాటి శ్రీను ఇంత లైట్ తీసుకున్నాడా

నటి రోహిణి తమ్ముడు టాలీవుడ్ లో పెద్ద విలన్ అని తెలుసా ?

ఖిలాడి తో రవితేజ మార్కెట్ పెంచుకునేనా..?

బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో చెప్పేసిన గంగవ్వ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -