ఖిలాడి తో రవితేజ మార్కెట్ పెంచుకునేనా..?

- Advertisement -

రవితేజ హిట్ చూసి చాలా రోజులైపోయింది.. అయన చేసిన అరడజను సినిమాలు భారీ పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు.. అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు హిట్ లేదంటే రవితేజ ఎంతలా డౌన్ లో ఉన్నాడో  అర్థం చేసుకోవచ్చు.. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు..

రవితేజ తో డాన్ శీను, బలుపు వంటి సినిమాలను చేసిన గోపీచంద్ మలినేని తో ఈ సరి మాస్ రాజ సినిమా ను అనౌన్సు చేశాడు.. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న రవితేజ మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ పోలీస్ అవతారం ఎత్తారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గా కాగా త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది..  ఇక ఈ సినిమా తరువాత రవితేజ చేయబోయే ఖిలాడీ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.. నోట్లు గాల్లో తేలుతుండగా రవితేజ స్టైలిష్ గా ఓ ఫోజిచ్చిన స్టిల్ ని ఇందులో పొందుపరిచారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయట. విక్రమార్కుడు తరహాలో ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. అయితే ఆ రెండు పాత్రల స్వభావాలు ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు.

- Advertisement -

మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించనున్నారు. కొంత గ్యాప్ తర్వాత రవితేజకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించే ఖిలాడీకి బడ్జెట్ కూడా భారీగానే కేటాయించినట్టు తెలిసింది. రవితేజకు సాలిడ్ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు చాలా అవసరం. వరసగా వచ్చిన డిజాస్టర్లు ఇమేజ్ పరంగా ఎలాంటి ఇబ్బంది సృష్టించనప్పటికీ మార్కెట్ విషయంలో మాత్రం డ్యామేజ్ జరిగింది. కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా తగిన మూల్యమే చెల్లించాల్సి వస్తోంది.  మరి ఈ సారి రవిజేతేజ ఇప్పుడు హిట్ కొట్టకపోతే మాత్రం హీరో గా తన కెరీర్ ముగిసిపోతుందనే చెప్పాలి..

బాలయ్య సరసన నటించే ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?

రవితేజ ఆ కథను ఒప్పుకున్నాడా..

రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!

మారుతీ భలే కాపీ కొట్టేశావే.. ఎవరికీ డౌట్ రాదనుకున్నావా..?

Most Popular

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు పనబాక లక్ష్మిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో దింపింది. ఇక...

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

ప్రస్తుతం ఓటిటిల కాలం నడుస్తుంది. కరోనా ఎఫెక్ట్ సినిమా రంగానికి గట్టిగానే తగిలింది. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్‍లు లేవు.. థియేటర్లు మూతపడాయి. షూటింగ్‍లు పూర్తి చేసుకోని రీలిజుకు నోచుకోని...

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ఒక్కో సారి దర్శకుడు చెప్పిన కథను సినీ పరిశ్రమలో హీరోలు రిజస్ట్ చేస్తుంటారు. కొన్ని హీరోల డేట్స్ కారణంగా వదులు కుంటుంటారరు. కొన్ని కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్...

Related Articles

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు. ఎన్నో ఒడిదుడుకులు అన్నిటిని అదిగమించి అతి కొంత మంది మాత్రమే పాతుకుపోతుంటారు. కేరియర్ ను విలన్ గా మొదలు పెట్టి.. ప్రస్తుతం స్టార్...

’ఖిలాడీ’ లో అనసూయ..!

ప్రస్తుతం ఉన్న బుల్లితెర యాంకర్స్ లో అనసూయ టాప్ లో కొనసాగుతోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికి తన హాట్ అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. ఈమెకు విపరితమైన ఫ్యాన్స్ ఉన్నారు. పిల్లల...

రవితేజ ఆ కథను ఒప్పుకున్నాడా..

మాస్ రాజా రవితేజ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో ఉందని చెప్పొచ్చు.. అయన చేసిన అరడజను సినిమాలు ప్రమాదంలో పడ్డాయి.. ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు.. అప్పుడెప్పుడో రాజ ది...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...