Tuesday, April 30, 2024
- Advertisement -

బ్రహ్మాజీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్..!

- Advertisement -

దర్శకుడు రాం గోపాల్ వర్మ దగ్గర నుంచి వచ్చి ఇండస్ట్రీలో మంచి నటుడిగా సెటిల్ అయిన వారిలో బ్రహ్మాజీ ఒకరు. కొన్ని చిత్రాల్లో హీరోగా చేసినప్పటికి పెద్దగా కలిసిరాలేదు. దాంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే రాణించాడు. కామెడీ చేయడంలో బ్రహ్మాజీ ది ప్రత్యేక శైలీ. బ్రహ్మాజీ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అయితే ఇన్నేళ్ల తన కెరీర్లో ఎప్పుడు తన వ్యక్తి గత విషయాల గురించి బ్రహ్మాజీ చెప్పలేదు.

అయితే తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మాజీ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పాడు. బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ’నేను ఆల్రెడీ పెళ్లై కొడుకు ఉన్న శశ్వతిని పెళ్లి చేసుకున్నాను. నాకు శశ్వతి చెన్నైలో ఉన్నప్పుడు పరిచయం అయింది. అయితే అప్పటికే ఆమెకి పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడు. మొదటి భర్తతో ఆమె విడాకులు తీసుకుని ఉంది. ఆ టైంలో మాత్రం ఆమెతో కొన్నాళ్లపాటు జర్నీ చేశాను. ఇద్దరి మనసులు కలిశాయి. అలా ఆమెని పెళ్లి చేసుకున్నాను. నాకు నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను.

అదేమీ గొప్ప విషయం కాదు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడమనేది ముఖ్యం. ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు వద్దు అనుకున్నాను. నా భార్యకి అప్పటికే కొడుకు ఉన్నాడు… చిన్నప్పటి నుండీ వాడు కూడా నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ పిల్లలు వద్దనుకున్నాను. ఒకవేళ పిల్లలు పుడితే నేను స్వార్ధంగా ఆలోచిస్తానేమో అని భయపడి పిల్లలను వద్దనుకున్నాను. ఇక నా కొడుకుకి కూడా సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించాను” అంటూ బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -