Saturday, May 4, 2024
- Advertisement -

కమ్మరాజ్యంలో కడపరెడ్లు నుంచి ‘దండం’ సాంగ్..!

- Advertisement -

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన అది సంచలనం అవుతుంది. పబ్లిసిటీ చేయడంలో ఆయనను మించినవారు లేరు. తాజాగా ఆయన కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాని తీశారు. ఈ సినిమాపై రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకుల పోలీకలను కలిగిన వారితో.. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితి ఏరడిందనే దానిపై ఈ సినిమాని తెరకెక్కించాడు వర్మ.

ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ పాటను రిలీజ్ చేశాడు వర్మ. . ‘దండం.. నమస్కారం, సెల్యూట్’ అనే సాగే ఈ పాటను తన ట్విట్టర్లో పోస్టు చేశాడు వర్మ. 3.45 నిమిషాలు ఉన్న ఈ పాట గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా నుంచి దండం ఫుల్ సాంగ్. నిజజీవితంలోని రాజకీయ నాయకుల క్యారెక్టర్లు ఇందులో ఉంటాయి.’ అని ట్వీట్ చేశాడు.

అయితే ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ లో ’అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా ఈ సినిమా టైటిల్ ను చేంజ్ చేస్తా అని చెప్పిన వర్మ.. ఇప్పుడు మళ్లీ ’కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే పేరుతోనే పాటను విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -