- Advertisement -
మాస్ మహరాజ్ రవితేజకు పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా అటు వైపుగా వెళ్తున్న రవితేజ కారును తనిఖీ చేశారు.
కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండడంతో పోలీసులు జరిమానా విధించారు. ముందుగా అద్దాలకున్న ఫిల్మ్ తొలగించి అనంతరం ఎనిమిది వందల రూపాయల జరిమానా విధించారు. ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించని సినీ, రాజకీయ ప్రముఖులకు భారీగాను జరిమానాలు విధించడంతో ప్రజల్లో వారిపై సదభిప్రాయం కలుగుతోంది.