Saturday, April 27, 2024
- Advertisement -

ఓటీటీలో ఈగల్ అదుర్స్!

- Advertisement -

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ఈగల్. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈగల్ తో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. రవితేజ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా అనుపమ,నవదీప్ కీలక పాత్ర పోషించారు.

రీసెంట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల అయిన 24 గంటల్లోనే ఇండియా వైడ్ గా టాప్ 3 మూవీగా ట్రెండ్ అవుతోంది. ఇక వీకెండ్ కావడంతో వ్యూస్ మరింత పెరిగే అవకాశం ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇక ఈగల్ తర్వాత రవితేజ…హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -