Thursday, May 2, 2024
- Advertisement -

సీనియర్ హీరో నరేష్ కు కమల్, పవన్‌ సీఎంలు కావాలట

- Advertisement -

సీనియర్ హీరో నరేష్ కు ఏదో అయిందనిపిస్తుంది. ఇంతకాలం మనోడు భాగానే ఉన్నాడు. కేవలం మా అసోసియేషన్ కు ఎలక్షన్లు అయినప్పుడు మాత్రమే సార్ లోని టెంపర్ బయటపడింది. తాజాగా తెలుగు ,తమిళ రాష్ట్రాలలోని కనిపిస్తున్న పొలిటికల్ హీటు అబ్బాయిగారికి భాగా కనిపించడంతో మరోసారి టెంప్ట్ అయ్యాడు. ఊహల్లో ఏవేవో లెక్కలు వేసేసుకుని మనోడు నోటికొచ్చినట్లు పేలుతున్నాడు. నరేష్ టంగ్ స్లిప్ పై సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్స్ ,చంద్రబాబు అభిమానులు విరుచుకుపడుతున్నారు.

ఇంతకీ నరేష్ చేసిన తప్పేంటంటే కమల్ హాసన్ ,పవన్ కళ్యాణ్ లను కాబోయే సిఎమ్ లుగా ట్వీట్ చేయడం . కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ముఖ్యమంత్రులైతే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ‘లక్షల మంది అభిమానులు, ప్రజలు.. కమల్‌, పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రులు కావాలని కలలు కంటున్నారు. అదే జరిగితే అప్పటి నందమూరి తారకరామారావు, ఎంజీఆర్‌ల శకాన్ని మళ్లీ చూడొచ్చు’ అని నరేష్ తన ట్వీట్‌ లో నొక్కి వక్కానించాడు. నరేష్ ట్వీట్లపై పవన్ ఫ్యాన్స్ పాజిటివ్ గా ఫీలౌతున్నారు.కాని అతను కొడుకు నవీన్ కెరియర్ గురించే నరేష్ ఇలా చవకబారు ట్వీట్లను పెడుతున్నాడంటున్నారు.గతంలో ఏనాడు మెగా కాంపౌండ్ ను మీదకు ఎక్కించుకోని నరేష్ కు ఇప్పుడెలా పవన్ హీరో అయిపోయాడని కొశ్చన్ చేస్తున్నారు.
నరేష్ ట్వీట్ చేసిన ఆ నాలుగు ఇంగ్లీష్ ముక్కలు ఇవే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -