Saturday, May 4, 2024
- Advertisement -

యాంకర్ సుమ ఇంట విషాదం… ఏం జరిగింది ?

- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆడపడుచు శ్రీలక్ష్మీ ఈ రోజు మరణించారు. ప్రముఖ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఈమె కూడా చాలా సీరియల్స్ లో నటించారు. కొద్ది కాలంగా ఆమె ఆరోగ్యం బాగలేదు. అందుకే నటనకు దూరంగా ఉంటుంది. శ్రీలక్ష్మి సోదరుడు రాజీవ్ కనకాల.

శ్రీలక్ష్మీ భర్త సీనియర్ జర్నలిస్టు పెద్ది రామారావు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. కొంతకాలంగా శ్రీ లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుంది. దాంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిసేపటి క్రితమే శ్రీలక్ష్మి మరణించారు. గతేడాది రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. సుమకు రాజీవ్ తో పెళ్లి కాకముందు శ్రీలక్ష్మీకి సుమ మంచి ఫ్రెండ్.

సుమతో శ్రీలక్ష్మీకి మంచి అనుబంధం ఉంది. రాజీవ్, సుమ ప్రేమ విషయం రాజీవ్ ముందు తనకే చెప్పాడని శ్రీలక్ష్మీ పలు సార్లు చెప్పింది. రాజీవ్ సుమతో ఇంతటి అనుబంధం ఉన్న శ్రీలక్ష్మీ ఒక్కసారిగా చనిపోవడంతో సుమ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -