Thursday, May 9, 2024
- Advertisement -

నిఖిల్ ప్రేమ స్టోరీ.. పెళ్లి వరకు ఎలా వెళ్లిందంటే ?

- Advertisement -

టాలీవుడ్ లో యంగ్ హీరోలు ప్రేమ పెళ్లిలు చేసుకోబోతున్నారు. వారెవరో ప్రత్యేకంగా మన నితిన్, నిఖిల్ గురించి చెప్పుకోవాలి. నితిన్ పెళ్ళి చేసుకోబోతున్నాడు అన్న విషయం పై ముందు నుండి కొన్ని వార్తలు వచ్చాయి. కానీ నిఖిల్ విషయంలో ఎలాంటి వార్తలు రాలేదు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా నిఖిలే ప్రకటించాడు.

తన సోషల్ మీడియా ద్వారా పల్లవి వర్మ అనే అమ్మాయి పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలిపాడు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉంటూ వస్తున్న నిఖిల్ ఎప్పుడు ప్రేమలో పడ్డాడు.. అది పెళ్ళి వరకూ ఎలా దారితీసింది అనే విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆశక్తి కలిగిస్తున్న తరుణంలో నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. నిఖిల్ మాట్లాడుతూ…” పల్లవి నా స్నేహితుల ద్వారా పరిచయం అయ్యింది.

తను డాక్టర్ ..! బేసిక్ గా నాకు సైన్స్ అంటే పిచ్చి. పల్లవి ఎక్కువగా సైన్స్ గురించి మాట్లాడుతూ ఉండేది. నాకు అవే ఇంట్రెస్ట్ కాబట్టి.. అవి వింటూ ఉండేవాడిని. అలా మా పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దాంతో నేనే డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాను. దీంతో పల్లవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే చెప్పేశారు. వెంటనే మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు” అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. అయితే నిఖిల్ పెళ్లి ఏప్రిల్ 16నే ఫిక్స్ చేశారు. కానీ కరోనా కారణంగా నిఖిల్ పెళ్లి వాయిదా పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -