Sunday, May 12, 2024
- Advertisement -

ఫిదా లో తండ్రిగా నటించిన సాయి చంద్ ఎవరో తెలుసా..?

- Advertisement -

ఇప్పుడు ఎవరి నోట విన్న ఒకటే మాట.. ఫిదా.. ఫిదా.. ఫిదా.. సినిమా యూనిట్ కూడా ఊహించని రెంజ్ లో ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో నటించిన సాయి పల్లవి దగ్గర నుంచి బుజ్జి కార్యెక్టర్ చెసిన బాబు వరకు ప్రతి ఒక్కరికి ఓ రెంజ్ లో క్రేజ్ వచ్చింది. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి తండ్రిగా సాయి చంద్ చాలా అద్భుతంగా నటించారు. సహజ నటనతో.. ప్రతి ఒక్కరిని కట్టిపడేశారు.

సాయి చంద్ పాతికేళ్ళ క్రితమే మా భూమి చిత్రంతో తన టాలెంట్ ఏంటో చూపించారు. హీరోగానే కాకుండా.. సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీనియర్ హీరోల సినిమాలు అన్నింటిలోను నటించాడు. అయితే కారణాలు ఏంటో తెలియదు కానీ ఉన్నట్లు ఉండి.. ఆయన సినీ పరిశ్రమకు నుంచి మాయం అయ్యారు. ఇప్పుడు ఫిదా సినిమాలో ఆయను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. చాలా సహజంగా, మేకప్ వేసుకుని రెండు దశాబ్దాలు దాటుతున్నా.. అవి తెలియనివ్వకుండా.. చాలా బాగా చేశారు. అయితే ఫిదా లో ఆయన పాత్ర చూసి నిజ జీవితంలో కూడా ఆయన తన పిల్లలతో అలానే ఉంటారేమో అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి చంద్ ఒక షాకింగ్ న్యూస్ తెలిపారు.

సాయి చంద్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదట. ఇంత టాలెంట్ ఉండి పరిశ్రమకు దూరంగా ఉండటం నిజంగా దురదృష్టమే. శేఖర్ కమ్ములకు ఆయన ఎలా గుర్తోచ్చాడో కాని థాంక్స్ చెప్పి తీరాల్సిందే. హీరో లేదా హీరొయిన్ తండ్రిగా ఒక్క ముక్క తెలుగు రాని పరబాషా నటులను చూడలేక ఇబ్బంది పడుతున్న తెలుగు వాళ్ళకు సాయి చంద్ ఫ్రెష్ ఆప్షన్ గా కనుపిస్తున్నాడు. ఆయనను మేకప్ లో కాకుండా మాములుగా చూస్తే అందరూ ఫిదా కావాల్సిందే.

https://www.youtube.com/watch?v=gWaKn1SPxLw

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -