Monday, April 29, 2024
- Advertisement -

NTR30లో టాలీవుడ్ సీనియర్ నటుడు..

- Advertisement -

యంగ్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీకి కమిటైన సంగతి తెలిసిందే. ” ఎన్టీఆర్ 30 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో తారక్ కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటింస్తుంది. జాన్వీ క‌పూర్ పుట్టిన‌రోజు సందర్బంగా మేక‌ర్స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

తాజా గా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేయలేదు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా NTR 30 చిత్రాన్ని తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో టాప్ టెక్నీషియ‌న్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -