ఆ నాయకుడి ఇలాకాలో జనసేన..!

Pawan Kalyan’s Jana Sena Party to celebrate in Machilipatnam
Pawan Kalyan’s Jana Sena Party to celebrate in Machilipatnam

జనసైనికులు ప్లేస్‌ మార్చారు. ఇంతకు ముందులా రభస జరగకుండా చూడాలని ప్లాన్‌ చేస్తున్నారు. పవన్‌ను విపరీతంగా టార్గెట్‌ చేసే ఓ మాజీ మంత్రి ఇలాకాలో దుమ్ము రేపాలని చూస్తోన్నారు. ప్రజల్లో, అభిమానుల్లో, సొంత సామాజిక వర్గంలో తమకు ఎంత పట్టుందో ఆ నాయకుడికి చూపించాని, ఇకపై పవన్‌ను లైట్‌ తీసుకోకుండా.. నోటికొచ్చింది మాట్లాడకుండా చేయాలని తహతహలాడుతున్నారు. పనిలో పనిగా తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌కు కూడా బలమైన సిగ్నల్స్ పంపాలని భారీ స్కెచ్‌ వేస్తున్నారు. మరి ఆ నాయకుడి ఇలాకా ఏది ? జనసేన తాజా బహిరంగ సభ ఏ విధంగా ఉండబోతోంది.

ఏపీలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటించిన ప్రతీసారీ ఏదో రకమైన పొలిటికల్‌ హడావుడి కన్పిస్తూనే ఉంటుంది. ఓ పక్క సినిమాలకు సమయం కేటాయిస్తూ నెలలో రెండు మూడు సార్లు రాష్ట్ర పర్యటనలో పాల్గొంటున్న పవన్‌ తన ప్రతీ పర్యటనలోనూ అధికార వైసీపీపై నిప్పులు చేరుగుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు, అమలు చేస్తోన్న పథకాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పవన్‌ విమర్శలకు వైసీపీ నేతలు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా పవన్‌ నడుస్తున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సైతం తన బహిరంగ సభల్లో అటు చంద్రబాబుతో పాటు ఇత పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్‌గా ఛాలెంజ్‌లు విసురుతున్నారు.

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 14న మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించాలని చూస్తోన్నారు. ఈ సభ ద్వారా మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన గళం బలంగా వినిపించాలని పవన్‌ భావిస్తోన్నారు. తనపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పేర్నినాని నోటికి ఈ సభ ద్వారా తాళం వేయాలని పవన్‌ చూస్తోన్నారు. దీంతో సీఎం జగన్‌కు జనసేన భలం వినిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.