ఒక పక్క తాగడానికి నీరు లేక మారుముల ప్రజలు ఇబ్బంది పడుతుంటే ,ఇక్కడ ఓ హీరోయిన్ మాత్రం బిస్లరీ వాటర్‌తోనే రోజు స్నానం చేస్తానంటుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే….సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు లగ్జరీగానే ఉంటుంది.వాళ్లు టిఫిన్ చేయడానికి కూడా ఫైవ్ స్టార్‌హోటల్‌కు వెళ్తారు.అతికొద్ది మంది మాత్రమే సాధారణ జీవితాన్ని గడుపుతారు.ఒక్కప్పటి హీరోయిన్ శ్రీవిద్య మాత్రం స్నానం చేయడానికి కూడా బిస్లరీ వాటర్ తీసుకురమ్మని చెప్పేవారట.
తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లాల్సి వచ్చిందట. అక్కడ ఓ గ్రామంలో ఉండడానికి ఏర్పాట్లు చేశారు.గోదావరి నీళ్లతో చేయాల్సి వచ్చిందట. వరదల కారణంగా నీళ్లు బురదగా ఉండడంతో ఆ నీటితో నేను స్నానం చేయనని,తన శరీర సౌందర్యం, ఆరోగ్యం దెబ్బ తింటాయని గొడవ చేసేవారట. దాంతో అందరికీ తాగడానికి తెప్పించే బిస్లరీ వాటర్‌ని బకెట్లలో పోసి ఇవ్వమన్నారట.