Thursday, May 16, 2024
- Advertisement -

లైంగిక వేధింపుల‌గురించి నోరు విప్పిన మ‌రో హీరోయిన్‌…

- Advertisement -

హాలీవుడ్ దర్శకుడు హార్వే విన్‌స్టెయిన్‌ లైంగిక వేధింపుల విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరుగా హీరోయిన్లు పెదవి విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో హీరోయిన్లకు లైంగిక వేధింపుల అంశాన్ని ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా మ‌ళ‌యాల హీరోయిన్ శ్రుతీ హరిహరన్ చేసిన త‌న‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల‌గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తను నటించిన ఒక సినిమా రీమేక్ ప్రతిపాదన సమయంలో.. తనపై లైంగిక పరమైన ఒత్తిళ్లు వచ్చాయని శ్రుతి చెప్పింది. కెరీర్ బిగినింగ్‌లో శ్రుతి న‌టించిన క‌న్న‌డ సినిమా బాగా హిట్టైంది. దాన్ని త‌మిళంలో రీమేక్ చేయ‌డానికి నిర్మాత హ‌క్కులు కొనుక్కున్నారు. తమిళంలో కూడా హీరోయిన్ గా నటించమని నన్ను సంప్రదించారు. దానికి నేను సరే అన్నాను. అయితే నిర్మాత ఓ ప్ర‌తిపాద‌న త‌న ముందు పెట్టార‌న్నారు.

తాము ఐదుగురం కలిసి ఆ సినిమాను రూపొందిస్తున్నామని.. షూటింగ్ జరిగినన్ని రోజులూ.. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఐదుగురం నిన్ను మార్చుకుంటాం… అని అతడు అన్నాడు. అతడి ప్రతిపాదన విని నేను వెంటనే కాల్లో చెప్పు తీసి చూపించా..’ అని శ్రుతి వివరించింది. తను తీవ్రంగా స్పందించడంతో ఆ సినిమా అవకాశం తన చేజారిందని, ఆ తర్వాత తమిళంలో అవకాశాలు కూడా పెద్దగా రాలేదని శ్రుతి పేర్కొంది. అయితే ఆ ప్రతిపాదన తెచ్చిన సదరు నిర్మాత పేరును ఈమె ప్రస్తావించక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -