మధ్యప్రదేశ్ గవర్నర్‌గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు ఆనంది బెన్ పటేల్‌ను నియమించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఆమెను గవర్నర్‌గా రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఆనంది బెన్ ఎప్పుడూ బాధ్యతలు స్వీకరిస్తే అప్పటినుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపాయి.
ప్రధాని బాధ్యతలు చేపట్టడానికి నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు 2014లో వదులుకున్నాయి. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్‌ను చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆమెను రెండేళ్లకు మించి సీఎం పదవిలో ఉంచలేకపోయారు. వెంటనే ఆమెను తొలగించి విజయ్ రుపానీకి బాధ్యతలు అప్పగించారు.
అప్పటినుంచి దాదాపు రెండేళ్ల పాటు ఖాళీగా ఉన్న ఆనందిబెన్‌ను చివరికి గవర్నర్‌గా పంపిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఓం ప్రకాశ్ కోహ్లి అదనపు ఉన్నారు. 2016 నుంచి అదనంగా గుజరాత్ బాధ్యతలు కూడా చూస్తున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనంది బెన్ బాధ్యతలు చేపడితే ఓంప్రకాశ్ గుజరాత్‌కు పూర్తిస్థాయి గవర్నర్‌గా కొనసాగుతారు.
