Thursday, April 25, 2024
- Advertisement -

గ‌ర్భం రావ‌డానికి పెళ్లితో ప‌నేంటి అంటున్న హీరోయిన్‌

- Advertisement -

సినిమా ప‌రిశ్ర‌మ‌లో డేటింగ్‌లు చేడం ప్రిగ్నెంట్స్ కావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. చాలా మంది తార‌లు పెళ్లికి ముందుగానె ప్రెగ్నెంట్ అవ్వ‌డం త‌ర్వాత పెళ్లి చేసుకోవ‌డం అనె ట్రెండ్ న‌డుస్తోంది. ఇంగ్లండు భామ అమీ జాక్సన్ మ్యారేజ్‌కు ముందే గర్భవతి కావడం మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఈ ఘ‌ట‌న మరవక ముందే మరో హీరోయిన్ బ్రూనా అబ్దుల్లా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. తాను ఐదు నెలల గర్భవతిని అని సోషల్ మీడియాలో వెల్లడించింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంపై వస్తున్న విమర్శలకు ధీటుగా బ‌దులిచ్చింది.

బ్రూనా అబ్దుల్లాకు బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్ అనే పేరు ఉంది. ఆమె నటించిన ఐ హేట్ లవ్ స్టోరీస్, గ్రాండ్ మస్తీ మంచి విజయాన్ని అందుకొన్నాయి. త‌ర్వాత తన చిరకాల మిత్రడు బ్రిటన్‌కు చెందిన అలెన్ ఫ్రేజర్‌తో కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్నది. బ్రెజిల్‌కు చెందిన ఈ అందాలభామకు తన బాయ్‌ఫ్రెండ్‌తో 2018 జూలై 19న ఎంగేజ్‌మెంట్ జరిగింది. అప్ప‌టినుంచి ఇద్ద‌రు స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.

పెళ్లి చేసుకోవడం అనే విషయాన్ని పట్టించుకోను. మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది నా దృ‌ష్టిలో ఓ పేపర్ మాత్రమే. ఇద్దరి మనసులు కలుసుకోవడానికి అంతా ముఖ్యం కాద‌ని సెల‌విచ్చింది. తమ బిడ్డ ఈ భూమ్మీదకు రావడానికి ముందే మేము పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాం. అలెన్ మా పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేను గర్బవతిని అనే విషయాన్ని దాచడం నాకు ఇష్టం లేద‌ని ధైర్యంగా చెప్పింది.డెలివరీ తర్వాత నా బిడ్డతోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్లాన్ చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -