Saturday, May 18, 2024
- Advertisement -

చిరంజీవి సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. త్వరలోనే అనౌన్స్!

- Advertisement -

మొన్నటి వరకూ నయనతార పేరు వినిపించింది. ఆమె భారీ స్థాయి పారితోషకం తీసుకొంటూ చిరంజీవి సినిమాకు ఓకే చెప్పిందని.. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల డబ్బు తీసుకోనున్నదని.. ఈ విధంగా సౌత్ లోనే నయనతార కొత్త రికార్డును సృష్టించబోతోందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఉత్తుత్తి మాటలేనని తెలుస్తోంది. అంతే కాదు.. మెగాస్టార్ సినిమాకు హీరోయిన్ ఫిక్సయ్యిందని కూడా తెలుస్తోంది.

ప్రస్తుతం బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ కాస్త బిజీగాఉన్న అంజలినే మెగాస్టార్ 150 వ సినిమాకు హీరోయిన్ అని ఫిలింనగర్ సమాచారం. ఈ మేరకు నిర్ణయం అయిపోయిందని.. ఇక అనౌన్స్ చేయడమే తరువాయి అని  తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుత ఫిజిక్ కు అంజలి అయితే సరిగా సెట్ అవుతుందని దర్శకుడు పూరీ కూడా భావిస్తున్నాడట.

ఇంతకు ముందు కూడా అంజలి వెంకటేశ్ వంటి హీరో పక్కన నటించింది. తద్వారా సీనియర్స్ పక్కన తను రాణించగలనని ఆమె రుజువు చేసుకొంది. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్. ఇప్పుడు ఏకంగా చిరంజీవి పక్కనే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. మరి ఇక్కడ నుంచి అంజలి కెరీర్ టర్న్ అవుతుందేమో..! ఒక రేంజ్ కు చేరుతుందేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -