Wednesday, May 1, 2024
- Advertisement -

ఆ డైరెక్టర్ కాపీ పేస్ట్ మాస్టర్

- Advertisement -

తనకు తాను గొప్ప డైరెక్టర్ గా చెప్పించుకునే ఒక వేస్ట్.. కాదు కాదు అతని దృష్టిలో బెస్ట్ డైరెక్టర్ రియల్ స్టోరి ఇది. సినిమాలు లేని టైమ్‌లో అతి సాధారణ జీవితం గడిపి.. ఒక్క హీట్టు సినిమా పడగానే అతని తల నిండా కొమ్ములు వచ్చేశాయి.. ఇంతకీ ఆ హిట్టు సినిమా స్టోరీ, సినిమా అతనిదేనా అంటే అదీ కాదు.. ఒక యాక్టర్‌ది.. తను డైరెక్టర్ అయితే అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాడేమో అని Day and night తన వెంట తిరిగి తన కనీస అవసరాలు తీర్చి.. తనకు తోచిన స్టోరి ఒకటి ఆ డైరెక్టర్ కి చెప్పాడట…

అసలే స్టోరీలు రాసుకోవడం రాని ఆ డైరెక్టర్ కి ఈ స్టోరి గుండె వరకు ఎక్కేసింది.. ఇక ఇందులో హీరో క్యారెక్టర్ నీదే అన్నాడు.. ఆ యాక్టర్ ఆనందానికి అవధుల్లేవు.. వెళ్ళి ఒక హీరోకి చెప్పాడు ఆ డైరెక్టర్.. అతనికి నచ్చింది.. ప్రొడ్యూసర్ ఎవరు అన్నాడు.. చూస్తున్నాం అన్నాడు.. కొన్ని నెలల తరువాత ఇంకో హీరో దగ్గరికి వెళ్ళాడు.. అతను కామెడి చేసే హీరో… సో.. నాకు సూట్ కాదు కాని.. ఆ హీరో దగ్గరికి వెళ్ళు నేను చెబుతాను అని అక్కడికి పంపాడు.. అక్కడికి వెళ్ళాడు.. అక్కడ ok అయ్యింది.. ఇక్కడ ఆ డైరెక్టర్ ఎక్కడికి వెళ్ళిన అక్కడికి ఈ యాక్టర్ వెళ్ళాడు ఒక డ్రైవర్‌గా.. ఎందుకంటే మన డైరెక్టర్‌కి కనీసం బైక్ కూడా లేదు.. సో అలాగా కొన్ని నెలలు గడిచాయి..

Almost Shooting కి వెళ్ళే వరకు వచ్చింది.. ఇంతలో ఈ స్టోరీ బాగుంది అని ఒక పెద్ద యంగ్ హీరోకి తెలిసి పిలిచాడు ఈ డైరెక్టర్ ని… అక్కడ సింగిల్ నైట్‌లో Story ok అయ్యింది.. 5 lacks అడ్వాన్స్ ఇచ్చారు.. అందులో నుండి rs5 కూడా ఆ యాక్టర్‌ కి ఇవ్వలేదు.. పైగా అందులో క్యారెక్టర్ కూడా ఇవ్వలేదు.. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది.. మన డైరెక్టర్ ఆ యాక్టర్‌ ని పక్కన పెట్టేశాడు.. ఆ విషయం తెలియని ఆ యాక్టర్ రోజూ వెళ్ళి కలుస్తున్నాడు.. ఇంతలో next movie start అయ్యింది.. అందులో కూడా ఒక్క క్యారెక్టర్ ఇవ్వలేదు.. ఒక రోజు అడిగాడు ఏంటి సార్ మీకు అంత మంచి స్టోరీ ఇస్తే నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు అని..

అందుకు ఆ డైరెక్టర్ ఓ సినీ ఎంకమ్మ అది నీ స్టోరీ కాదు చెన్నైలో నా ఫ్రెండ్ ది అన్నాడు.. ok మీ చెన్నై ఫ్రెండ్ దే అయితే మూవీలో వేరే పెద్ద రచయిత పేరు ఎందుకు వేశారు.. అంటే.. అది బిజినెస్ కోసం అన్నాడట.. its ok నాకు కొంచెం help చేయండి ఒక 10,000 అంటే… sorry help less అని లేచి వెళ్ళిపోయాడట ఆ డైరెక్టర్.. ఒక్క సినిమాకి కోటి రూపాయలు తీసుకునే స్థాయిని ఇచ్చింది ఆ స్టోరి.. కాని స్టోరీ ఇచ్చిన వాడికి మన డైరెక్టర్ ఇచ్చిన గుర్తింపు ఇది.. ఇప్పటికి ఆ డైరెక్టర్ దగ్గర చాలా మంది కొత్త రచయితలు పని చేస్తున్నారు.. చూద్దాం రేపు ఎవరి వంతో మోసపోవడానికి… ఇంతకి ఎవరా డైరెక్టర్ ఎవరా ఫేమస్ యాక్టర్… just think…. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -