Wednesday, May 1, 2024
- Advertisement -

‘మా’ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఇండిపెండెట్‌ అభ్య‌ర్థిగా న‌టి హేమ‌

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు క‌న్నా రంఝుగా జ‌రుగుతున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు. మా అధ్య‌క్షుడు కాల‌ప‌రిమితి ఈ నెల 10న ముగియ‌నుండ‌టంతో మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం అయింది. ప్ర‌స్తుతం ‘మా’ అధ్యక్షుడిగా వ్యవహరించిన శివాజీరాజా మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. శివాజీ రాజా మీద పోటీగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా వ్యవహరించిన హీరో నరేష్ రెడీ అవుతున్నారు. న‌రేష్ ఏకంగా సొంత ప్యానెల్‌ను కూడా పెట్టేశారు. నరేష్ అధ్యక్ష పదవికి, జీవిత రాజశేఖర్ లు ప్యానల్ లో కీలక పదవుల కోసం పోటీ చేస్తున్నారు. అయితే శివాజీ రాజా ప్యానెల్ ఎవ‌రో తెలియాల్సి ఉంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో న‌టి హేమ స్యంతంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తుంది. ఆమె గ‌త ఎన్నిక‌ల్లో శివాజీ రాజా ప్యానెల్లో మెంబ‌ర్‌గా పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే ఈ సారి ఎన్నిక‌ల్లో ఆమె ఎవ‌రు త‌రుపుర కాకుండా స్యంతంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డం విశేషం.

ఆమె ఈ ఎన్నిక‌ల్లో సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. త‌న‌కున్న ప‌రిచియాల‌తో హేమ ఈజీగానే గెలుపుతుందార‌ని భావిస్తున్నారు ఇండ‌స్ట్రీలోని వ‌ర్గం. ప్యానెల్ త‌రుపున అయితే ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నార‌నే కామెంట్స్ వ‌స్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే హేమ ప్యానెల్ త‌రుపున కాకుండా ఇలా స్వంతంత్య్ర అభ్య‌ర్థిగా చేస్తున్నార‌ని వినికిడి. సినిమా కార్మికులు మంచి ప‌నులు చేయాలనే ఉద్దేశం ఉన్న హేమ , త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని చాలామంది చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం హేమ త‌న బ‌లం పెంచుకునే ప‌నిలో ప‌డ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -