Tuesday, April 30, 2024
- Advertisement -

ప్ర‌పంచ క‌ప్‌కు రిషభ్‌ పంత్ ప‌నికి రాడ‌ట‌..!

- Advertisement -

టీమిండియా యువ సంచ‌ల‌నం వికెట్ కీప‌ర్ రిషభ్‌ పంత్ వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్‌కు అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు టీమిండియా మాజీ ప్లేయ‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్. వ‌చ్చే ప్ర‌పంచ క‌ప్‌లో టీండియాకు ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు ఉన్నార‌ని అంటున్నాడు ల‌క్ష్మ‌ణ్‌. ఈ మెగా టోర్నీకి సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ధోని, బ్యాకప్‌ కీపర్‌గా దినేశ్‌ కార్తీక్‌లు సరిపోతారని చెప్పుకొచ్చాడు. పంత్‌కు ఇలాంటి టోర్నీలు ఆడిన అనుభ‌వం లేద‌ని , అందుచేత‌నే అత‌ను ఈ టోర్నీకి ప‌నికి రాడ‌ని తెలిపాడు ల‌క్ష్మ‌ణ్‌.

ప్ర‌పంచ‌క‌ప్ చాలా ప్రధానమైనదని, ఇలాంటి టోర్నీలకు యువ ఆటగాళ్ల కన్నా.. అనుభవం ఉన్న సీనియర్‌ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. పంత్ క‌న్నా కార్తీక్‌ను ఎంపిక చేయాలని చెప్పుకొచ్చాడు.. ఇక బౌలింగ్‌ విభాగంలో నలుగురు పేసర్లు మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ ఖలీల్‌ అహ్మద్‌, ఇద్దరు స్పిన్నర్లు చహల్‌, కుల్దీప్‌లతో భారత్‌ బరిలోకి దిగాలన్నాడు. ల‌క్ష్మ‌ణ్ త‌న ప్ర‌పంచ క‌ప్ టీమ్‌ను ప్ర‌క‌టించాడు.

లక్ష్మణ్‌ ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టు
రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని, కేదార్‌జాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యుజవేంద్ర చహల్‌, జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌, షమీ, రాహుల్‌ , దినేష్‌ కార్తీక్‌, ఖలీల్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -