Sunday, May 5, 2024
- Advertisement -

గరుడ వేగ రిలీజ్ ఆనందంలో ఉన్న జీవిత రాజశేఖర్ ఫ్యామిలీలో పెద్ద విషాదం..

- Advertisement -

రాజశేఖర్ కెరీర్ లో.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ గరుడ వేగ. సినిమా హిట్ అవుందని ఆనందంగా ఉన్న సమయంలో రాజశేఖర్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఇటివలే రాజశేఖర్ మాతృమూర్తి మరణించగా.. గురువారం జీవిత వాళ్ల అన్నయ్య మురళీ శ్రీనివాస్ మరణించారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రిలీజ్ అవుతున్న గరుడ వేగ సినిమా నిర్మాణ బాధ్యతల్లో మురళీ పాలుపంచుకున్నారు. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలోనే మూరళీ ఆరోగ్యం దెబ్బతింది. కిడ్నీ దెబ్బతినడంతో ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. కానీ ఆయన కోలుకోలేదు. అభిమానుల సందర్శనార్థం గురువారం ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల మధ్య మురళీ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్లో ఉంచారు. ఈ రోజు సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

గత వారం రోజులుగా మూరళ్లీ హాస్పటల్లో చికిత్స పొందారు. దీంతో ఆయన్ను జాగ్రత్తగా చూసుకుంటూనే రాజశేఖర్ దంపతులు సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో ఉండగా మురళీ ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్త అందింది. దాంతో ఆయన మధ్యలోనే ఆ కార్యక్రమం ఆపేసి హూటాహుటిన ఆసుపత్రికి వెళ్ళారు. కాగా ఈ తెల్లవారుజామున మురళీ తుది శ్వాస విడిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -