Saturday, May 4, 2024
- Advertisement -

జ్యోకం చేసుకోకు.. అఖిల్ కి అమల స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం ఏంటి..?

- Advertisement -

సినీ పరిశ్రమలో రకరకల వ్యక్తులు రకరకల మనస్తత్వాలతో ఉంటారు. కొందరు హీరోలు అయితే.. టెక్నీషియన్లకు, నిర్మాతలకు, దర్శకులకు చుక్కలు చూపిస్తుంటారు. కథ ప్రకారం సీన్ చేయకపోగా తమకు తోచినట్లు చేసి అదే కరెక్టు అంటుంటారు. దాంతో కొందరు దర్శకులు, కెమరామెన్లు తాము అనుకున్నట్లుగా సీన్ రాకపోవడంతో మూడ్ ఆఫ్ అవుతారు. దాంతో సినిమాపై ఆ ప్రభావం ఘోరంగా ఉంటుంది.

ప్రధానంగా సినీయర్ నటులు, పెద్ద హీరోల విషయంలో ఇటువంటి సంఘటనలు చాలానే జరుగుతుంటాయి. అయితే సినిమా పరిశ్రమలో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన కొందరు యువ కథ నాయకులు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారట. మూవీ షూటింగ్ లో ఎవరి వాళ్లు చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. హీరో, డైరెక్టర్, నిర్మాత ఇలా ఎవరి పని చేసుకుంటే సినిమా మంచి గా పర్ ఫెక్ట్ గా వస్తుంది. అయితే కొంతమంది హీరోలు మాత్రం డైరెక్షన్ లో వేలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే కోవలో అఖిల్ అక్కినేని కూడా ఉన్నాడు. మనం లాంటి సినిమాని అక్కినేని ఫ్యామిలీకి ఇచ్చిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో హలో అనే సినిమా చేస్తున్నాడు అఖిల్.

దర్శకుడు చేసే ప్రతి పనిలో ప్రతి సీనులో ఇలా ఉండాలి. అలా ఉండాలి. అని అనవసంగా ఇన్వాల్వ్ అవుతన్నాడట. ఈ సంగత్తిని బరించలేక డైరెక్టర్ విక్రం కుమార్.. నాగార్జునతో ఇలాగైతే సినిమా తీయలేనని చెప్పేశారట. దాంతో నాగార్జున వెంటనే అఖిల్ ని పిలిపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. తాజాగా అఖిల్ తల్లి అమల కూడా అఖిల్ కి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు చెప్పినట్లు వినమని.. ఎలాంటి జోక్యం చేసుకోవద్దు అని గట్టిగానే చెప్పిందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -