Tuesday, April 30, 2024
- Advertisement -

ఝాన్సీగా వస్తున్న జ్యోతిక

- Advertisement -

హీరోయిన్ జ్యోతిక హీరో సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.పెళ్లి త‌రువాత సినిమా ఆపేసింది జ్యోతిక‌.ఆమె తిరిగి సినిమాల‌లో న‌టిస్తే నాకు చూడాల‌ని ఉంద‌ని ఆమె భ‌ర్త సూర్య వెల్లండించిన కొన్నాళ్లే,జ్యోతిక సినిమాల‌లో తిరిగి న‌టించ‌డం ప్రారంభించింది.తాజాగా ఆమె నటించిన మూవీ నాచియార్. ఈ సినిమా త‌మిళనాట ఘ‌న విజయం సాధించింది.ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డ‌బ్ చేస్తున్నారు.క్రైమ్ డ్రామాగా వ‌చ్చిన ఈ చిత్రంలో విభిన్న పాత్ర‌ల‌తో త‌న‌దైన న‌ట‌న‌, అభిన‌యంతో క‌థ‌ను ర‌క్తిక‌ట్టించ‌గ‌ల స్టార్ హీరోయిన్ జ్యోతిక‌, పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు.

జ్యోతిక న‌ట‌న‌పై ఆమె భ‌ర్త హీరో సూర్య అభిన‌ద‌న‌లు తెలిపాడు.ఇక ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ జివి.ప్ర‌కాష్ కీలక పాత్ర‌తో కనిపించి మెప్పించాడు.ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించాడు.త‌మిళ సంచ‌ల‌న ధ‌ర్శ‌కుడు బాల త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో ఝాన్సీ పేరుతో తెలుగులో విడుద‌ల చేయ‌నున్నారు.త్వ‌ర‌లోనే ఈ చిత్రం యొక్క టీజ‌ర్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. జ్యోతిక చాలా రోజులు త‌రువాత తెలుగు తెర మీద క‌నిపించ‌నున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -