Thursday, May 2, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌ ఎంట్రీపై స్పందించిన హెబ్బా ప‌టేల్‌

- Advertisement -

హీరోయిన్ హెబ్బా ప‌టేల్ వైల్డ్‌కార్టు ఎంట్రీ ద్వారా తెలుగు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని వార్త‌లు గ‌త కొన్ని రోజులుగా వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది హెబ్బా పటేల్. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయని ఆమె అసహనం వ్యక్తం చేసింది. నేను ఎలాంటి షోలలో పాల్గొనడం లేదు.. బిగ్ బాస్ లో నేను పార్టిసిపేట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడితో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలని ఇలా పోస్ట్ పెట్టింది.

కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్న హెబ్బా ‘మిస్టర్’,’అంధగాడు’,’ఏంజెల్’ ఇలా వరుస ఫ్లాప్ లు రావడంతో కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ’24 కిస్సెస్’ అనే సినిమా ఒక్కటే ఉంది. ఇక బిగ్‌బాస్ యాంక‌ర్‌గా న్యాచ‌ర‌ల్ స్టార్ నానికి మంచి మార్కులే ప‌డ్డాయి.బిగ్‌బాస్ ఈ వారం ఎలిమినేష‌న్‌లో భాగంగా భాను శ్రీ ఎలిమినేట్ అయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -