కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీలో రామ్ హీరోగా నటించిన “నేను శైలజ” సినిమాతో పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అలనాటి నటి సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో సావిత్రి అంటేనే కీర్తి అనేలా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కేరళ ముద్దుగుమ్మ. కీర్తి సురేష్ మహానటి తర్వాత తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
తాజాగా కీర్తి సురేష్ ప్రస్తుత కరొన పరిస్థితులపై స్పందిస్తూ తన వంతు బాధ్యతగా కరోనా జాగ్రత్తలు సూచిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇందులో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని,శానిటైజ్‌ను ఉపయోగించాలని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళకండి అని సూచించింది. అలాగే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించాలని తన అభిమానులను కోరుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also read:తన ఫోటోకి పాలాభిషేకం పై స్పందించిన సోను సూద్.. ఏమన్నారంటే?
కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న “సర్కారు వారి పాట” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ తమిళ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే మూవీలోనూ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలోను హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.