- Advertisement -

బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?

- Advertisement -

ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “అఖండ”. ఈ మూవీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్ సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయగా తాజాగా వీరి కాంబినేషన్లో వస్తున్న “అఖండ” మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం “అఖండ” సినిమా షూటింగ్ కార్యక్రమాలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న రిలీజ్ కావాల్సింది. ప్రస్తుత విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.

Also read:త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసా?

“అఖండ” సినిమా విడుదల వాయిదా పడడంతో బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.దాంతో నందమూరి అభిమానుల కోసం బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూన్10న ‘అఖండ’ సినిమా టీజ‌ర్‌ ను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర దర్శక, నిర్మాతలు.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషనలో సినిమా వస్తున్న విషయం అధికారికంగా ప్రకటించారు.

Also read:నాకు సీఎం కావాలని ఉందంటున్న సీనియర్ నటుడు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -