Sunday, April 28, 2024
- Advertisement -

కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటున్న హీరోయిన్

- Advertisement -

లక్ష్మి రాయ్ అంటే తెలియని వారెవరు ఉండరు. ఆమె చేసిన సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. అయితే తాజా గా ట్విట్టర్ ఒక సమస్య పై తన బాధ ని వెళ్లగక్కింది. తనకి కరెంట్ బిల్ ప్రతీ నెల ఎక్కువ వస్తుందని లక్ష్మి తెలిపింది.

“మాకు వచ్చే ఎలెక్ట్రిసిటీ బిల్ ని నేను కొన్ని నెలలుగా గమనిస్తూ వస్తున్నాను. నేను తెలుసుకుంది ఏంటి అంటే, దాదాపుగా ప్రతి నెల నేను గత నెల కట్టిన దాని కన్నా డబుల్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఇంటికి రావడమే గగనం. గత మూడు నెలలు గా నేను పెద్దగా వచ్చింది లేదు కానీ బిల్ మాత్రం చాలా వచ్చింది. అదానీ ఎలెక్ట్రిసిటీ బోర్డు ని సంప్రదించే ప్రయత్నం చేసాను కానీ ఏది వర్క్ అవుట్ కాలేదు. నేను కష్ట పడి సంపాదించిన డబ్బు ఇలా వృధా అవుతుంటే నాకు చాలా బాధ గా ఉంది. ఎవరైనా సహాయం చేయండి వారిని సంప్రదించడానికి.” అని లక్ష్మి రాయ్ పేర్కొంది.

నిజంగా ఒక సెలబ్రిటీ పరిస్థితి ఇలా ఉంటె ఇక మాములు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనమే ఆలోచించుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -