Sunday, May 5, 2024
- Advertisement -

ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరిచిన కార్తికేయ

- Advertisement -

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ కార్తికేయ ఈ మధ్యనే విడుదలైన ‘హిప్పీ’ సినిమాతో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. ఇప్పుడు ‘గుణ 369’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తికేయ. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో చూస్తే కార్తికేయ పాత్ర గురించి తెలుస్తుంది. “మనిషి రూపం వేరు నిజ స్వరూపం వేరు” అంటూ కనిపించిన కార్తికేయ ఒకవైవు లవర్ బాయ్ గా హీరోయిన్ అనఘ తో రొమాన్స్ చేసిన కార్తికేయ యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు.

ఈ సినిమా ట్రైలర్ చూస్తే గుణ పాత్రలో కార్తికేయ నటన హైలైట్ అవుతుంది అని చెప్పచ్చు. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ గా మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఎస్ జీ మూవీ మేకర్స్ పతాకంపై తిరుమల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కానీ విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మరి ఈ సినిమాతో కార్తికేయ విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -