Tuesday, May 21, 2024
- Advertisement -

రేష్మీ రెచ్చిపోతోంది .. అందాల విందు

- Advertisement -

బుల్లితెర మీద అందాలతో అదరగొట్టి ఇక సిల్వర్ స్క్రీన్ పై విచ్చల విడి అందాల ప్రదర్శనకు రెడీ అయిన రేష్మి.. ఈ ఇయర్ వచ్చిన గుంటూర్ టాకీస్ తో హిట్ అందుకుంది. సినిమాకు కావాల్సినంత హాట్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నంలో అమ్మడు కాస్త గ్లామర్ షో ఎక్కువే చేసింది. అయితే ఇప్పుడు ‘అంతం’ అంటూ మరో సినిమాతో వస్తున్న రేష్మి ఇందులో కూడా ఏమాత్రం తగ్గలేదు.

తనకు వచ్చిన ఈ హాట్ ఇమేజ్ డైవర్ట్ అవ్వకుండా అంతం సినిమాలో కూడా హాట్ లుక్స్ తో కేక పెట్టించింది రేష్మి. గుంటూర్ టాకీస్ లోనే అమ్మడు చేసిన స్కిన్ షోకి కుర్రాళ్ల మతులు పోయాయి. ఇక అంతంలో మరింత రెచ్చిపోయినట్టు కనబడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చరణ్ దీప్ తో రొమాన్స్ చేసింది రేష్మి.

సినిమాలో మీరు ఊహించనిది జరుగబోతుంది అంటూ సస్పెన్స్ కూడా బాగానే క్రియేట్ చేసినట్టున్నారు. సో మొత్తానికి సినిమా ఎలాటిదైనా దానికి తగ్గ గ్లామర్ షో కోసం రేష్మి మాత్రం తగ్గేది లేదన్నట్టు కనబడుతుంది.

{youtube}AIWWT-5VCGI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -