Tuesday, May 14, 2024
- Advertisement -

ఉద‌య్‌కిర‌ణ్‌ను ద‌త్త‌త తీసుకుని ఉంటే అలా జ‌రిగేది కాదు!

- Advertisement -

న‌టి సుధ అలీతో క‌లిసి ఓ టీవి ప్రొగ్రామ్‌లో పొల్గొన్నారు.సుధ ఈ షోలో ప‌లు ఆశ‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది.త‌న సినీ కెరీర్ ఎలా మొద‌లైందో,త‌న‌ను ఇండ‌స్ట్రీలో ఎవ‌రు ప్రొత్స‌హించారో తెలిపింది.దీంతో పాటు న‌టుడు ఉద‌య్ కిర‌ణ్‌తో త‌న‌కున్న అనుబంధన్ని ఈ షోలో తెలిపింది.మీతో ఉద‌య్‌కిర‌ణ్ ఎలా ఉండేవాడు అని అలీ అడ‌గగానే కంట‌త‌డి పెట్టుకుంది సుధ‌.

ఉద‌య్‌కిరణ్ హీరో కాక‌ముందు నుంచే త‌న‌కు తెలుసున‌ని,చాలా సినిమాల‌లో ఉద‌య్ కిర‌ణ్‌కు అమ్మ‌గా న‌టించాన‌ని చెప్పింది.చాలా మంచి వాడ‌ని, ఎవ‌రికైనా స‌హ‌యం చేయ‌ల‌ని చూసేవాడు అని తెలి పింది. అయితే ఉద‌య్ కిర‌ణ్ సినిమాల‌లో అవ‌కాశాలు త‌గ్గ‌డానికి ఓ వ‌ర్గం ప‌నిచేసింద‌ని నా అనుమానం అని సుధ తెలిపారు.ఉద‌య్ కిరణ్‌ను నేను ద‌త్త‌త తీసుకొవ‌ల‌ని భావించాను అని ఈ లోపే వాడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.ఆత్మ‌హ‌త్య‌కు ముందు ఉద‌య్ కిర‌ణ్ చాలా డ‌ల్‌గా ఏదో పొగొట్టుకున్నావాడిలా ఉండేవాడు.నేను ఓ రోజు పిలిచి అడిగితే మీతో చాలా చెప్పాలి అమ్మ అన్నాడు.

కాని ఇప్పుడు కాదు నేనే మ‌న ఇంటికి వ‌స్తాను అన్నాడు.అలా చెప్పిన కొన్ని రోజుల‌కే ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.ఉద‌య్ చ‌నిపొతే నా సొంత కొడుకు చ‌నిపోయిన‌ట్లు ఉంది.ఒక‌వేళ నేను ద‌త్తత తీసుకుని ఉంటే ఇలా జ‌రిగేది కాదేమో.ఉదయ్‌కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాదు.కాని ఇలా ఎందుకు చేశాడో ఇప్ప‌టికి నాకు అర్థం కావ‌డం లేదంటు క‌న్నీరు పెట్టుకున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -