Saturday, May 18, 2024
- Advertisement -

బైక్ నుంచి పడింది.. బస్సు ఢీకొంది.. అదాశర్మకు యాక్సిడెంట్!

- Advertisement -

‘హార్ట్ ఎటాక్’ “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అదాశర్మకు యాక్సిడెంట్ అయ్యింది. ఒక సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. చిత్రీకరణలో భాగంగా నడుపుతున్న బైక్ నుంచి అదా కింద పడింది.

ఇదే సమయంలో బస్సు ఢీ కొనడంతో అదా గాయపాలయ్యింది. ప్రస్తుతానికి ఆమె ఆసుపత్రిలో చేరింది. అయితే గాయాల తీవ్రత గురించి.. ప్రమాద ‘స్థాయి గురించి తెలియడం లేదు కానీ.. అదా నుంచి దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చింది. తను పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నట్టుగా ఆమె ప్రకటించించింది.  తనకు ఏమీ కాలేదని ఆమె వివరణ ఇచ్చింది.

బుధవారం ఉదయం  చోటు చేసుకొన్న ఈ సంఘటనలో అదా పూర్తిగా సురక్షితంగా బయటపడింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో పూర్తి స్థాయి రోల్ ను చేయకపోయినా. ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. ఇలాంటి దశలో ఆ సంఘటన చోటు చేసుకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -