Friday, March 29, 2024
- Advertisement -

హైపర్ ఆది వెన్నుపోటు పై అదిరే అభి పంచ్..!

- Advertisement -

తాజాగా వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో విడుదల చేయగా.. ఇందులో ఎప్పటిలాగే హైపర్ ఆది.. తన టీం సభ్యుడు దొరబాబుని టార్గెట్ చేశారు. ఇక ఇదే తరహలో ఇంకో టీం లీడర్ అదిరే అభి సైతం ఆదితో గతంలో జరిగిన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ పంచ్ వేశాడు.

గతంలో అభి టీంలో చేసి ఆది.. ఆ తర్వాత అభికే ఎర్త్ పెట్టి సొంతంగా టీం ఏర్పాటు చేసుకుని టీం లీడర్ అయిన విషయం తెలిసిందే. ఆదిని జబర్దస్త్‌కి తీసుకువచ్చిన అభికే వెన్నుపోటు పొడిచాడని చాలా స్కిట్స్‌లలో పంచ్‌లు వస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే వెన్నుపోటు అంశాన్ని మరోసారి తన స్కిట్‌లో లేవనెత్తాడు అభి. తన స్కిట్‌లో అమ్మాయిని ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని అడుగుతాడు అభి.. సారీ అభి!! చిన్నప్పుడే మా నాన్న నాకు సంబంధం చూశారు అని చెప్తోంది ఆ అమ్మాయి.

ఇంతకీ ఎవడాడు అంటూ కోపంగా అభి అడగ్గా.. ‘అది.. అది.. అని సంకోచిస్తూ గ్యాప్ ఇస్తుంది ఆ అమ్మాయి. దీనికి అభి.. ‘ఆది’నా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. నేను చెప్పింది హైపర్ ఆది గురించి కాదు.. ఏదో ఆలోచిస్తూ అది అది అంటున్నా.. నువ్ ఆది అంటున్నావ్ అని క్లారిటీ ఇస్తుంది. హమ్మయ్య 2016నే మర్చిపోలేకపోతుంటే.. మళ్లీ ఈ కొత్తదేంటి? అనుకుంటున్నా అంటూ ఆదిపై పంచ్ వేశాడు అభి. వెంటనే రోజా ‘వెన్నుపోటు’ అంటూ హైపర్ ఆది 2016లో అభిని ఆది పొడిచిన వెన్నుపోటుని బహిర్గతం చేశారు. మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి.

శ్రీముఖి, విష్ణుప్రియతో గొడవపై స్పందించిన వర్షిణి..!

సోనూ సూద్ రియల్ హీరో.. 400 కుటుంబాలకు సాయం

మేము మళ్లీ వచ్చాం అంటూ ఫోటోస్ షేర్ చేసిన నటి నవ్య..!

అన్నయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ చెల్లి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -