Thursday, May 16, 2024
- Advertisement -

ర‌విబాబు అదుగో మూవీ టీజ‌ర్‌..

- Advertisement -

వైవిధ్యమైన దర్శకుడిగా పేరు ఉన్న రవిబాబు ప్రస్తుతం ‘అదిగో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం మీద మంచి ఆసక్తి ఏర్పడింది. పైగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వస్తుండటంతో ‘అదిగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే అప్పుడెప్పుడో ‘అదుగో’ సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు రవిబాబు. నోట్ల రద్దు సమయంలో రవిబాబు పంది పిల్లను పట్టుకుని ఏటీఎం క్యూలో నిలబడి తన సినిమాను ప్రమోట్ చేశాడు.రెండేళ్లు అవుతున్నా ఆసిన‌మా గురించి ఊసే లేదు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల అయ్యింది.

అదిగో సినిమాలో పందిపిల్ల‌నే ప్ర‌ధాన పాత్ర‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీజ‌ర్ ఉంది. బంటి అనే పంది పిల్ల చిన్న పిల్లాడి ఆదేశాల ప్రకారం కూర్చోవడం, నిలబడటం, డ్యాన్స్ చేయడం.. అనే కాన్సెప్ట్‌తో టీజర్ విడుదల చేశారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నారట. టీజర్లో రవిబాబు మార్కు టేకింగ్, సెట్ డిజైన్ స్పష్టంగా కనిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -