Saturday, May 18, 2024
- Advertisement -

మళ్లీ మ్యాజిక్ కు ‘బాయ్స్’ రెడీ

- Advertisement -

సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ సినిమాల్లో ఒకటి.. బాయ్స్. తమిళంలో అనుకున్న హిట్ సాధించలేకపోయినా.. తెలుగులో మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది బాయ్స్. ప్రేమతో పాటు.. లక్ష్యం కోసం ఆరాటపడే యువతీ యువకులకు సంబంధించిన ఈ కథతో అప్పట్లో చాలా మంది కనెక్ట్ అయ్యారు.

ఈ సినిమా వచ్చి 13 ఏళ్లయింది. ఇన్నాళ్లకు బాయ్స్ టీమ్ కలిసి పని చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశాడు. అంతి కలిసి మళ్లీ పని చేయడం ఆనందంగా ఉందనీ.. త్వరలోనే సినిమాకు సంబంధించిన విశేషాలు చెబుతామని.. తమన్ వివరించాడు.

అయితే.. మళ్లీ తమన్ ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేస్తాడా? లేక కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తాడా? అసలు ఈ సినిమాకు మళ్లీ శంకర్ డైరెక్టర్ గా ఉంటారా? లేక.. వేరే దర్శకుడి నేతృత్వంలో సినిమా రూపొందనుందా? ఇలా.. చాలా అనుమానాలు.. కలుగుతున్నాయి. ప్రస్తుతానికి తమన్ వేటిపై క్లారిటీ ఇవ్వకపోయినా.. అందరిలో మాత్రం కాస్త ఎగ్జయిట్ మెంట్ క్రియేట్ చేశాడని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -