Monday, April 29, 2024
- Advertisement -

అయ్యో పాపం రకుల్ ప్రీత్

- Advertisement -

గత కొంత కాలం గా విజయం లేకుండా అవకాశాల తో సతమతం అవుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇదే అదనుగా చూసుకొని కొన్ని మీడియా సంస్థలు రకుల్ పైన నెగటివ్ రూమర్స్ కూడా రాసిన విషయం తెలిసందే. ఇక రకుల్ పని అయిపొయింది. ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు, తన లక్ పని చెయ్యడం లేదు అని, ఇలా ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేశారు. అంతే కాకుండా బాలీవుడ్ లో సినిమా చేస్తుంటే ఇక్కడ అవకాశాల్లేక అటు వైపు అడుగులు వేసింది అని అందరూ తిట్టి పోశారు కూడా. అయితే దే దే ప్యార్ దే సినిమా విజయం తో అందరి నోళ్లు మూయించిన రకుల్ ప్రీత్ నిన్న విడుదల అయినా ఎన్జీకె తో ఆ పని చెయ్యడం లో పూర్తి గా విఫలమయ్యింది.

సూర్య సరసన నటించిన ఈ భామ ఈ సినిమా పరాజయం పాలవడం తో మళ్ళి విమర్శలని ఎదురుకొంటుంది. అయితే ఇదంతా తన కెరీర్ లో భాగమే అని రకుల్ ప్రీత్ తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్పినట్లు తెలుస్తుంది. కాకపోతే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రకుల్ ప్రీత్ మాత్రం కచ్చితంగా ఒక విజయం తో పుంజుకోవాలి. లేకపోతే కొత్త గా వస్తున్న హెరొఇనెస్ రకుల్ కి పెద్ద థ్రెట్ లాగా మారే అవకాశం ఉంది.

మొత్తానికి హమ్మయ్య హిట్ కొట్టాను అని అనుకుంటున్నా రకుల్ కి ఈ కొత్త సినిమా పరాజయం పెద్ద పరీక్ష నే పెట్టనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -