Saturday, May 11, 2024
- Advertisement -

పవన్ నిర్లక్ష్యం వళ్ళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కోసం పవన్ ఏం చేయడా?

- Advertisement -

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో మదర్ థెరిసా బర్త్ డేకి వైట్ అండ్ వైట్‌లో కాస్త హంగామా చేసేవాడు చిరంజీవి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మదర్ థెరిసా అంతా దయార్థ్ర హృదయం ఉన్నవాడిని అని ప్రజలను నమ్మించడానికి చాలానే నమ్మించాడు. పేపర్‌లో విషాదవార్తలు చూసినా కరిగిపోతానని ఆ మధ్య ఘనంగా చెప్పుకొన్నాడు. అలాగే తన వళ్ళ నష్టపోయిన బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌కి న్యాయం చేస్తానని చెప్పాడు. జానీ సినిమా విషయంలో చాలా చేశానని చెప్పుకున్నాడు. తన దయార్థ్ర హృదయం గురించి పవన్ చెప్పుకున్నవన్నీ నిజాలేనా?

సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా వళ్ళ నష్టపోయిన పవన్ హార్డ్ కోర్ అభిమాని…..గుంటూరు డిస్ట్రిబ్యూటర్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర రోజుల తరబడి నిరాహార దీక్ష చేశాడు. పవన్ కనీసం పట్టించుకోకపోగా తన చుట్టూ ఉన్న మాఫియాతో అతనని బెదిరించాడు. ఆ విషయాన్ని స్వయంగా ఆ డిస్ట్రిబ్యూటరే చెప్పుకున్నాడు. ఇక కాటమరాయుడు సినిమాను కొన్నవాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు తాజాగా అజ్ఙాతవాసి సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ చర్చకు తీసుకొచ్చారు. అజ్ఙాతవాసి సినిమా కొన్న ఒక డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఙాతవాసి సినిమాల విషయంలో పవన్ నిర్లక్ష్యం కూడా చాలానే ఉంది. అన్ని సినిమాల్లోనూ ఇష్టం లేనట్టుగా……టైం పాస్ వ్యవహారంలా పవన్ నటన ఉంటుంది మరి. అలాగే ఈ మూడు సినిమాలకూ ఒక్కో సినిమాకు 25 కోట్లపైనే తీసుకున్నాడు పవన్. మరి తన సినిమాలు కొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు…….జీవితాలను నష్టపోయిన వాళ్ళ విషయంలో పవన్ స్పందన ఏమీ ఉండదా? తన చుట్టూ ఉన్న మాఫియాతో వాళ్ళను బెదిరించిన వైనం కూడా సినిమా ఇండస్ట్రీ జనాలను షాక్‌కి గురిచేస్తోంది. మదర్ థెరిస్సా కబుర్లు చెప్పే పవన్ నుంచి ఇలాంటి ప్రతిస్పందనలు అయితే ఎవ్వరూ ఊహించలేదు. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా పవన్‌ హార్డ్ కోర్ ఫ్యాన్సే కావడం గమనార్హం. ఇప్పుడు ఆ ఫ్యాన్సే పవన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. తన స్వార్థం కోసం……తన పాతిక కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కోసం జీవితాలను నాశనం చేసిన పవన్…….భవిష్యత్తులో తెలుగు ప్రజలకు ఏదో చేస్తానంటే నమ్మాలా? పవన్ కూడా ఫక్తు డబ్బు మనిషేనని…… కాకపోతే మదర్ థెరిస్సాలాంటివాడిని అన్న కవరింగ్ మాత్రం ఇస్తూ ఉంటాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -