Saturday, May 18, 2024
- Advertisement -

కబాలి కోసం ఫ్లైట్ .. ప్రపంచం లో మొట్ట మొదటి సరిగా ..

- Advertisement -

రజినీకాంత్ విషయం లో ఏదైనా సెన్సేషన్ అని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ ఇండియా లో హాట్ హాట్ టాపిక్ గా మారిన సినిమా కబాలి. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందరకి రాబోతోంది అంటున్నారు. ఈ సినిమా మీద అంచనాలు ఇప్పటికే ఒక రేంజ్ లో ఉండగా ట్రైలర్ విడుదల అయిన తర్వాత అవి డబల్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే ఆడియో బయటకి రాగా ట్రైలర్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎయిర్ ఆసియా విమాన యాన సంస్థ ఈ సినిమాకి సంబంధించి వినూత్న ప్రచారం చేస్తోంది. ‘ఫ్లై లైక్ ఏ సూపర్ స్టార్’ అన్న కాన్సెప్ట్‌తో ఏయిర్ ఏషియా జూలై 3వరకూ ఆన్‌లైన్లో కొన్ని ప్రత్యేక బుకింగ్స్‌ను ఓపెన్ చేసింది. చాలా తక్కువ ధరకే వచ్చేలా ఈ బుకింగ్స్‌లో కొన్ని ఆఫర్స్ ఉండడం మరో విశేషం.

ఇలా ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ చేపట్టని తరహా ప్రమోషన్స్‌తో కబాలి అంతటా సెన్సేషన్‌గా మారిపోయింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -