కొత్త రాష్ట్రం తెలంగాణా ని బంగారు తెలంగాణా గా మార్చాలి అని కెసిఆర్ చూస్తూ ఉంటే ఉంటె గులాబీ తమ్ముళ్ళ కుమ్ములాటలతో అది ఆయనకి విసుగ్గా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయం లో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న వేల కొందరు తెరాస నేతల మధ్యన సీరియస్ వార్ జరుగుతోంది. వరంగల్ జిల్లా లోని పెద్ద లీడర్ లు కడియం శ్రీహరి , ఎర్రబెల్లి దయాకరరావు లకి అస్సలు పడ్డం లేదు.
వారిద్దరూ జిల్లాలో ఆధిపత్యం ప్రదర్శించడం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ హడావిడి చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచీ తెరాస లో ఉన్న కడియం ఉప ముఖ్యమంత్రి గా ఉన్నారు. కాగా ఎర్రబెల్లి ఈ మధ్యనే టీడీపీ నుంచి తెరాస లోకి వచ్చారు. వరంగల్ లో ఎర్రబెల్లి ఆధిపత్యం పెరగకూడదు అనేది కడియం ఆలోచన. ఈ విషయం లో ఆయన్ని తోక్కేస్తున్నారు కడియం.
దీనికి తోడు ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అంశం వీరిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందని అంటున్నారు.వరంగల్ జిల్లా నుంచి కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఒకటి భూపాలపల్లి కాగా మరొకటి మహబూబాబాద్. అయితే మొదట్లో ప్రతిపాదిత జిల్లాల జాబితాలో ఉన్న జనగాం అనూహ్యంగా వెనక్కి వెళ్లిపోయింది. దీనికి కడియం కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.
