Thursday, April 25, 2024
- Advertisement -

ఐశ్వర్య రాయ్ మ‌ళ్లీ త‌ల్లి కాబోతుందా ..?

- Advertisement -

ఐశ్వర్య రాయ్ ..ప్ర‌పంచ సుందరి ఓ వెలుగు వెలిగింది. ఇద్ద‌రు అనే సినిమాతో సినీ ఇండ‌స్ట్రీ అడుగు పెట్టిన ఐశ్వర్య రాయ్ త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా మ‌ణిర‌త్నం సినిమాల‌తో బాగా ఫేమ‌స్ అయింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి అక్క‌డ నెం1 గా నిలిచింది ఐష్‌. ఈ స‌మ‌యంలోనే బాలీవుడ్‌లో రెండు, మూడు ప్రేమ క‌థ‌లు కూడా సాగించింది. చివ‌రికి అభిషేక్ బ‌చ్చ‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. పెళ్లి త‌రువాత ఐశ్వర్య రాయ్‌కు సినిమాల‌లో అవ‌కాశాలు కూడా త‌గ్గాయి. త‌న సెకండ్ ఇన్నింగ్స్‌లో కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికి అవి పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. దీంతో కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటుంది.

తాజా ఐశ్వర్య రాయ్‌కు సంబంధించిన న్కూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఐశ్వర్య రాయ్ మళ్లీ తల్లి కాబోతుంద‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి త‌గ్గిన‌ట్లుగానే ఐశ్వర్య రాయ్ కొన్ని రోజులు నుంచి బ‌య‌టికి రావ‌డం లేద‌ని స‌మాచారం. అయితే ఇది ఊట్టి రూమ‌ర్లే అని కొట్టి పారేస్తున్నారు బచ్చ‌న్ కుటుంబ స‌భ్యులు. వారికి ఇప్ప‌ట్లో పిల్ల‌ల్ని క‌నే ఆలోచ‌న లేదు. వారు ఒక పాప చాలు అని అనుకుంటున్నారని బ‌చ్చ‌న్ ద‌గ్గ‌రి బంధువు ఒక‌రు తెలిపారు. దీనిని బట్టి చూస్తే ఐశ్వర్య రాయ్ తల్లి కాబోతుంద‌నే వార్త‌లు ఊట్టి పుకార్లే అని అర్థం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -