Tuesday, May 21, 2024
- Advertisement -

సరోగసీ గ‌ర్భ‌వ‌తిగా మాజీ విశ్వ‌సుంద‌రి

- Advertisement -

గర్భం అద్దెకు ఇవ్వడం (స‌రోగసీ) అంశంపై ఓ సినిమా బాలీవుడ్‌లో రూపొందిస్తున్నారు. మొదటగా తన గర్భాన్ని అద్దెకు ఇచ్చేందుకు ఒప్పుకోవడం.. ఆ సమయంలో ఎదురయ్యే కష్టాలు.. బిడ్డను కన్న తర్వాత తిరిగి అప్పగించలేకపోవడం వంటి ఇతివృత్తంతో ఓ సినిమా చేస్తున్నారు. అయితే.. గర్భవతిగా మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్య‌రాయ్ క‌నిపించ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే త‌ల్లిగా ఉన్న ఆమె ఈ పాత్ర‌లో న‌టిస్తున్నార‌నే వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక‌య్యింది.

టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ సినిమాతో ఆకట్టుకుంటున్న దర్శకుడు శ్రీనారాయణ సింగ్ స‌రోగ‌సీ అంశంపై `జాస్మిన్8 అనే కొత్త చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ ఒక్క ఫొటో సినిమా అంశం మొత్తం వివ‌రిస్తోంది. గ‌ర్భ‌వ‌తి క‌డుపుపై రెండు చేతులు పొదిలి మాదిరిగా పెట్టి ఉన్న ఫొటో అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది. గర్భంపైనే సోల్డ్ అని రాయడం.. డెలివరింగ్ సూన్ అని క్యాప్షన్ పెట్టడం స‌రోగ‌సీ విధానం చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఈ గ‌ర్భ‌వ‌తి పాత్ర‌లో ఐశ్వర్యారాయ్ ప‌క్క‌గా సెట్ అవుతుంద‌ని సినిమా నిర్మాతలు భావిస్తున్నారు. జాస్మిన్ మూవీ పై ఇప్పటికే ఐష్ తో చర్చలు జరగగా.. ఇంకా ఆమె ఏమీ చెప్పాలేదంట‌. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో గర్భంపైనే సోల్డ్ అని రాయడం.. డెలివరింగ్ సూన్ అని క్యాప్షన్ పెట్టడం ఆకట్టుకుంటున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -