Sunday, May 5, 2024
- Advertisement -

బ్ల‌డ్ గ్రూపులు నాలుగు కాదు ఐదు

- Advertisement -
  • కొత్త‌ది వ‌చ్చి చేరిందోచ్‌..

మ‌న‌కు జీకే క్వ‌శ్చ‌న్‌లో బ్ల‌డ్ గ్రూపులు ఎన్ని అని ప్ర‌శ్న వేస్తే గుక్క తిప్పుకోకుండా స‌మాధానం చెబుతాం. నాలుగు గ్రూపులు ఉన్నాయని చెప్పేస్తారు. అది నిజ‌మే కానీ నిన్న‌టివ‌ర‌కే. ఇప్పుడు ఆ స‌మాధానం త‌ప్పు. మొత్తం బ్ల‌డ్ గ్రూపులు ఐదుగా మారాయి. ఆ కొత్త గ్రూపు ఏమిటి అంటే రీసస్ నెగిటివ్(RH Null). ప్రపంచంలో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఈ గ్రూప్ ఉంది. దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు.

ఒక వ్యక్తి శరీరంలోని యాంటీజెన్ కౌంట్ ఆధారంగా వారి బ్లడ్ గ్రూప్‌ను తెలుసుకోవచ్చు. అయితే ఎవరి శరీరంలోనైనా యాంటీజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్‌ను రేర్ గ్రూప్ రీసస్ నెగిటివ్(RH Null)గా పరిగణిస్తారు. యాంటీజెన్ అనేది శరీరంలోని యాంటీబాడీలో తయారవుతుంది. అది శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది.

అయితే ఎవరి దగ్గరైతే ఈ కొత్త బ్లడ్ గ్రూప్ ఉంటుందో వారు తమ ర‌క్త‌దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడగలుగుతారు. 52 సంవత్సరాల్లో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఇటువంటి బ్లడ్‌గ్రూప్ ఉన్నట్టు తెలుస్తోంది. రీసస్ నెగిటివ్ బ్లడ్ కలిగినవారు ప్రపంచంలో ఎవరికైనా సరే రక్తదానం చేయవ‌చ్చు. వారి గ్రూప్ అన్నీ బ్ల‌డ్ గ్రూపుల‌తో క‌లుస్తుంది. ఈ అరుదైన్ బ్లడ్ గ్రూప్ కలిగినవారు సాధారణ మనుషుల్లానే ఉంటారు. అయితే ఈ గ్రూప్ ఉన్న వ్య‌క్తులు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ర‌క్త కొరత ఏర్ప‌డితే మరింత శ్రద్ధ పెట్టాలి. త‌మ‌ బ్లడ్ గ్రూప్ ర‌క్తం ఇచ్చేవారు దొరకడం చాలా కష్టం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -