Friday, April 26, 2024
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఈ ఇద్ద‌రు హీరోల గురువుగా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌‌గ‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఇవాళ అజ‌య్ దేవ్‌‌గ‌న్ పుట్టిన రోజు(ఏప్రిల్ 2) కావ‌డంతో.. ఆర్ఆర్ఆర్ లో అజ‌య్ దేవ్‌‌గ‌న్ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్.  

రాం చరణ్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్, కొమురం భీంగా ఎన్.టి.ఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామరాజుకి జంటగా సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్, భీంకి జంటగా బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్ నటిస్తున్నారు.

కాగా, ఈ మూవీలో ఈ ఇద్ద‌రు హీరోల గురువుగా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌‌గ‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటూ సినిమా మీద మరింతగా అంచనాలు పెంచుతోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -