Tuesday, April 23, 2024
- Advertisement -

RRRలో బాలీవుడ్ హిరో..

- Advertisement -

ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజియేస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది RRR అని చెప్పుకోవ‌చ్చు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌.. ఇద్ద‌రు అగ్ర‌క‌థ‌నాయ‌కులు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌టీఆర్‌.. క్రియేటివ్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తుండ‌టంతో ఈ మూవీకి సంబంధించి ఏ చిన్ని వార్తైనా ఇప్పుడు సెన్సేష‌నే అని చెప్పుకోవాలి. ఇప్పుడీ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా నటించనున్నారనే వార్త వైర‌ల్ అవుతోంది. ఓ గెస్ట్ రోల్‌లో అజయ్ కనిపిస్తాడని, పాత్ర చిన్నదే అయినా, అది అందరికీ గుర్తుండి పోతుందనీ సీని వ‌ర్గాల ముచ్చ‌ట‌.

అజ‌య్, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఇది రెండో సినిమా. మొదటిది ఏంటో అనుకుంటున్నారా.. గతంలో రాజమౌళి తన ‘ఈగ’ చిత్రాన్ని హిందీలో అనువదించినప్పుడు ఆ సినిమాకి అజయ్ దేవగణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. అప్పటి నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య మంచి ఫ్రెండ్‌షిప్ బిల్డ్ అయింద‌ని స‌మాచారం. ప్రస్తుతం ఈ మూవీ రెండో షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. కొన్ని రోజుల్లో తార‌క్ షూటింగ్‌లో పాల్గొంటాడ‌ని.. చెర్రి రెస్ట్ తీసుకుంటార‌ని.. కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -