Tuesday, May 7, 2024
- Advertisement -

హీరోయిన్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్

- Advertisement -

యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొనాలనే ఆత్రుత తో ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది కానీ క్రమక్రమంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ముఖ్యం గా ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ రావడానికి ముఖ్య కారణం హీరోయిన్ ఇంకా దొరకకపోవడం. ఎలాగైనా ఈ సినిమా లో క్రేజ్ ఉన్న హీరోయిన్ ని పెట్టుకోవాలి అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు కానీ ఇప్పటి వరకు దాని మీద క్లారిటీ రాలేదు. ఒకరిద్దరిని అడిగిన వారు బిజీ గా ఉన్నామని సమాధానమిచ్చారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఎలాగైనా రష్మిక తో సినిమా చేయాలనీ భావిస్తున్నారు.

రష్మిక మాత్రం బిజీ గా ఉన్నాను అనే సంకేతాలు ఇచ్చేసింది. కాకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి అయినా, తన డేట్స్ అడ్జెస్ట్ చేసి అయినా అఖిల్ సరసన రష్మిక ని పెట్టుకోవాలని అంతా భావిస్తున్నారు. మరి కొద్దీ రోజుల్లో రష్మిక తన ఫైనల్ నిర్ణయం చెప్పే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రానున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -