Friday, May 10, 2024
- Advertisement -

రోహిత్ క్యాచ్ వ‌దిలేసి భారీ మూల్యం చెల్లించుకున్న బంగ్లా…

- Advertisement -

వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(104: 92 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు) పరుగుల వరద పారిస్తున్నాడు. మెగా టోర్నీలో అద్వితీయ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. రోహిత్‌ సాధించిన రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీలో అతనికి లైఫ్‌లు లభించడం ఇక్కడ గమనార్హం . దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ క్యాచ్‌ వదిలేసినందుకు ఆ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. రోహిత్‌ (122 నాటౌట్‌) సెంచరీ నమోదు చేశాడు. తాజాగా బంగ్లా మ్యాచ్‌లో కూడా రోహిత్ క్యాచ్‌ను వ‌దిలేయ‌డంతో భారీ మూల్యం చెల్లించుకుంది. లైఫ్ ల‌భించ‌డంతో రోహిత్ సెంచ‌రీ చేశారు.

ముస్తాఫిజుర్‌ వేసిన ఐదో ఓవర్‌ నాల్గో బంతికి రోహిత్‌ పుల్‌ షాట్‌ ఆడాడు. మిడ్‌ వికెట్‌ మీదుగా ఆడిన ఆ షాట్‌ బ్యాట్‌కు సరిగా తగలకపోవడంతో క్యాచ్‌ రూపంలో పైకి లేచింది. ఆ అవకాశాన్ని తమీమ్‌ ఇక్బాల్‌ జార విడిచాడు. క్యాచ్‌ను పట్టినట్లే పట్టి వదిలేశాడు. ఆ సమయానికి రోహిత్‌ 9 పరుగులతో ఉన్నాడు. త‌ర్వాత త‌న బ్యాట్‌కి ప‌ని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -