Sunday, May 19, 2024
- Advertisement -

సింగల్ హ్యాండ్ తో లాగేస్తున్న అఖిల్

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని అక్కినేని నట వారసుడి కోసం ఎదురు చూసారు అక్కినేని అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా అక్కినేని కుర్రాడి అరంగేట్రం కోసం బాగా ఎదురు చూసారు. అనుకున్నట్టు గా దసరాకి పాజిబుల్ కాకపోయినా ఇంకా లేట్ గా దీపావళి నాడు అడుగు పెట్టిన అఖిల్ తొలి రోజు రేవ్ రివ్యూస్ తో నడిచాడు.

సినిమాలో విషయం లేదు అంటూ క్రిటిక్స్ ఈ సినిమా ని ఏకి  పడేసారు. అంతకు ముందే రొటీన్ గా వచ్చిన బ్రూస్ లీ చూసిన చిరాకులో ఉన్న విశ్లేషకులు ఈ సినిమా ని బాగా విసుక్కున్నారు. ఎందుకు ఆ అవసరం లేని సీన్ లు సరిగ్గా తీయడం లో వినాయక్ ఫెయిల్ అయ్యాడు అంటూ బాగా క్రిటికల్ గా రివ్యూ లు రాసారు కూడా. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఈ సినిమా ప్రెజెంట్ అదిరిపోయే కలక్షన్ లు సాధిస్తోంది .

మొదటి రొజు దాదాపు తొమ్మిదిన్నర కోట్ల పైనే కొల్ల గొట్టిన అఖిల్ తెలుగు సినిమాకి కొత్త తరం సూపర్ స్టార్ తానె అని మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడు. ఈ సినిమా లో కంటెంట్ బీలో యావరేజ్ గా ఉన్నా జనాలు ఎగబడి మరీ సినిమాకోసం వెళ్ళడానికి అఖిల్ కారణం అంటూ మళ్ళీ  అదే క్రిటిక్ లు చెప్పుకొచ్చారు. పేలవంగా సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అఖిల్ ఎక్కడా సినిమా ని ఫ్లాట్ అవ్వనివ్వకుండా కాపాడాడు అని, సాధారణంగా ఎక్స్ పీరియన్స్ ఉన్న హీరోలు మాత్రమే ఇలా సినిమాని ఒంటి చేత్తో లాగగాలుగుతూ ఉంటారు అని అఖిల్ మెచ్యూరిటీ కి ఇది నిదర్సనం అని అంటున్నారు.

అఖిల్ గనక ఇదే పంధా కొనసాగిస్తూ మరింత యాక్షన్ లో మెళకువలు తన తండ్రి కింగ్ నాగ్ నుంచి నేర్చుకుంటే నెక్స్ జనరేషన్ కి సూపర్ స్టార్ అవ్వడానికి మంచి ఆస్కారం ఉంది అని అంచనాలు వస్తున్నాయి. డైలాగుల విషయంలో , ఫైట్ లూ, డాన్సుల విషయంలో మొట్ట మొదటి సినిమా నేనా అనిపించే విధంగా చేసాడు అని సరైన సబ్జెక్ట్ లు ఎంచుకుంటే ఇక తిరుగు లేని స్టార్ అయిపోతాడు అని విశ్లేషకులు చెబుతున్నూర్. మొదటి రోజు టాక్ చూసి సినిమా బ్రేక్ ఈవెన్ వస్తుందా లేదా అనుకున్న డిస్ట్రిబ్యూటర్ లకి ఇది సూపర్ వార్త. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -