Monday, May 6, 2024
- Advertisement -

అత‌డు నాగార్జున కొంప‌ముంచేశాడు

- Advertisement -

అనూప్ రూబెన్స్ కొంప‌ముంచేశాడు. డిజిట‌ల్ మీడియాలో తేడా వ‌స్తే డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌ని తెలిసి కూడా…. చేయాల్సిన త‌ప్పు చేసేసాడు. దీంతో అక్కినేని ఫ్యామిలీ సీరియ‌స్ అయిపోయింది. అక్కినేని వారి అన్న‌పూర్ణ స్టూడియోస్ యూ ట్యూబ్ ఛాన‌ల్ దీనికి శిక్ష అనుభ‌వించాల్సి వ‌చ్చింది. విష‌యంలోకి వెళితే…. అక్కినేని అఖిల్ మ‌లి చిత్రం..హ‌లో సినిమా టీజ‌ర్ గురించే ఇదంతా మాట్లాడుకోవ‌ల్సి వ‌స్తుంది.

హ‌లో చిత్రానికి ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ .ఇత‌గాడు ఏ స్థాయి ద‌ర్శ‌కుడో మ‌న‌కు తెలిసిందే. ఇదే ద‌ర్శ‌కుడి చేతిలో త‌యారైన మ‌నం సినిమా ఎంత‌టి గొప్ప గౌర‌వాన్ని అందిపుచ్చుకుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్కర్లేదు.ఆ సినిమాకు అనూప్ రూబెన్స్ చ‌క్క‌ని ట్యూన్ ల‌ను అందించాడు. దాంతో అనూప్ ను అక్కినేని వెంచ‌ర్ లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. కాక‌పోతే ఇక్క‌డే స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఈ సినిమా టీజ‌ర్ కు వాడిన ట్యూన్ ను అనూప్ …హాలీవుడ్ వెంచ‌ర్ మ‌మ్మోత్ చిత్రం నుంచి లేపేశాడు.దీంతో పెంట పెంట అయిపోయింది.స‌ద‌రు చిత్రం వారు ఈ ట్యూన్ చూసి మాది కాపీ కొట్టార‌ని డైరెక్ట్ గా అన్న‌పూర్ణ స్టూడియోస్ యూ ట్యూబ్ ఛాన‌ల్ కు స్ట్రైక్ కొట్టారు.దెబ్బ‌కు మ‌తులుపోయిన నాగార్జున వెంట‌నే త‌మ ఛాన‌ల్ నుంచి టీజ‌ర్ ను డిలీట్ చేశారు. మ‌రి ఈ త‌ప్పు అనూప్ చేశాడా లేక అఖిల్ అత్యుత్సాహంతో చేయాల్సి వ‌చ్చిందో తెలియ‌కుండా ఉంది.

బ్యాన్ కు గురైన అఖిల్ టీజర్ అఫీషియల్ లింక్..

మ‌మ్మోత్ ట్రాక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -