Saturday, May 4, 2024
- Advertisement -

‘హలో’కి యూట్యూబ్ షాక్

- Advertisement -
  • అఖిల్ సినిమా టీజ‌ర్ తొల‌గింపు

హ‌లో సినిమా చిత్రానికి యూట్యూబ్ షాకిచ్చింది. అఖిల్ న‌టించిన సినిమా టీజ‌ర్‌ను యూట్యూబ్‌లో నుంచి తొల‌గించింది. అయితే ఎందుకు తొల‌గించారో తెలియ‌డం లేదు. ఇటీవ‌ల హ‌లో టీజ‌ర్ విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. దీంతో సినిమాను డిసెంబ‌ర్ 22వ తేదీన విడుద‌ల చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో ఇలాంటి ఊహించ‌ని ప‌రిణామం చోటుచేసుకుంది.

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో ‘హలో’ సినిమా వస్తోంది. ‘హలో’ అఫిషియల్‌ టీజర్‌ను వీక్షించేందుకు యత్నించగా అక్కడ సదరు వీడియోను కాపీరైట్ వివాదం కారణంగా తొలగించినట్లు యూట్యూబ్‌ పేర్కొంది. యాడ్‌రేవ్‌ అనే థర్డ్‌ పార్టీ సంస్థ కాపీరైట్‌ క్లైయిమ్‌ చేయడంతో యూట్యూబ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఏ కాపీరైట్‌ ఉల్లంఘన కారణంగా వీడియోను తొలిగించారనేది ఇంకా తెలియరాలేదు. సాధారణంగా వేరే ఎవరికైనా చెందిన ఏదైనా ఆడియో లేదా వీడియోను ఉపయోగిస్తే కాపీరైట్‌ సమస్యలు తలెత్తుతాయి. మరి అసలు ఏం జరిగిందో.. ఎందుకు తొలగించారో తెలియాలంటే హ‌లో సినిమా బృందం స్పందించాల్సిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై అఖిల్ ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ‘టీజర్‌ను సోషల్ మీడియాలో 8 మిలియన్లకు పైగా చూశారు. ‘హలో’ సినిమా టీజర్‌ కాపీరైట్‌ ఉల్లంఘన అంటూ వస్తున్న ఆరోపణలపై నిర్మాతలుగా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ సినిమాకు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించిన ‘రియల్లీ స్లో మోషన్‌’ మ్యూజిక్‌తో కలిసి పనిచేస్తున్నందుకు మేం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. అకారణంగా ఇంత రాద్ధాంతం చేయడమెందుకు’ అని అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -