Friday, May 3, 2024
- Advertisement -

మెరిసే మెరిసే నీ క‌న్నుల్లో

- Advertisement -

హ‌లో సంగీత్ వీడియో పాట విడుద‌ల

మెరిసే.. మెరిసే ఆ క‌న్నుల్లో ఏదో మెరిసే అంటూ అక్కినేని అఖిల్ పాటేసుకున్నాడు. వివాహ సంగీత్‌లో భాగంగా హీరోయిన్‌తో క‌లిసి స్టెప్పులేశాడు. హ‌లో సినిమాలోని ఓ పాట‌ను ఈ రోజు అఖిల్ త‌న ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేశారు. ఎంతో ప్రేమ‌తో ఈ సంగీత్ పాట అంటూ ట్విట్ట‌ర్‌లో పంచుకున్నాడు. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌తో క‌లిసి అఖిల్ వ‌స్తుంటే హీరోయిన్ సైగ చేసి హాయ్ అంటుంది. అప్పుడు అఖిల్ మొద‌లుపెట్టేస్తాడు పాట‌ను. ఆడుతూ.. పాడుతూ.. అఖిల్ డ్యాన్స్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌లో ఈ పాట వ‌చ్చింది. ఈ సినిమాలో కల్యాణి హీరోయ‌న్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్‌ ప్రధాన పాత్రలుగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్మాత నాగార్జున. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీకి విడుద‌ల చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -